'రెమ్యూనరేషన్ పెంచమంటుంటే..కొత్త టీమ్స్ ని తీసుకొస్తాం అంటున్నారు'.
on Oct 14, 2022
ఈ మధ్య జబర్దస్త్ లో రెమ్యూనరేషన్స్ గొడవలు బాగా పెరుగుతున్నట్టు కనిపిస్తున్నాయి. కమెడియన్స్ డైరెక్ట్ గా చెప్పలేక స్కిట్స్ రూపంలో మేనేజర్ లకు హింట్స్ ఇస్తున్నారు. ఇప్పుడు రాకెట్ రాఘవ కూడా అలాగే చేసాడు. రీసెంట్ గా రిలీజ్ ఐన జబర్దస్త్ ప్రోమో చూస్తే అర్ధమవుతుంది. రాబోయే వారం రాకెట్ రాఘవ క్యూట్ లేడీ గెటప్ లో టెన్నిస్ ప్లేయర్ గా పాప అనే పేరుతో రాఘవ స్కిట్ చేయబోతున్నాడు.
టెన్నిస్ ప్రత్యర్థిగా బరిలోకి దిగి రాకెట్ పట్టుకుని స్టేజ్ పై ఆడనా, వద్దా అన్నట్టుగా కామెడీ చేసేసరికి ఆపోజిట్ టీమ్ నుంచి నాగి వచ్చి “రేయ్ నేను ఇంతలా ఎగురుతుంటే...ఇదేంటి ఇది ఇంత కూడా ఎగరట్లేదేంటిరా ?” అనేసరికి దానికి రాఘవ..”ఎగిరెగిరి దంచినా అదే కూలీ.. ఎగరకుండా దంచినా అదే కూలీ” అంటూ పంచ్ డైలాగ్ వేసాడు.. దాంతో నాగి వచ్చి "అందుకే మరి మేనేజర్ దగ్గరికి వెళ్లి మాట్లాడమంటున్నాను అనే సరికి ఆ..నేను మాట్లాడడానికి వెళ్ళినప్పుడల్లా కొత్త టీమ్ లను తీసుకొస్తాం" అని బెదిరిస్తున్నారంటూ రాఘవ ఒక రేంజ్ ఫీలింగ్స్ తో చెప్పేసరికి నాగి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
రాకెట్ రాఘవ జబర్దస్త్ మొదలైన దగ్గర నుంచి ఇందులోనే ఉన్నాడు. ఐతే ఈమధ్య రెమ్యూనరేషన్స్ కి సంబంధించి చాలామంది స్కిట్స్ చేస్తున్నారు.. ఇంటర్వూస్ లో కూడా చెప్తున్నారు. ఇప్పుడు రాఘవ కూడా అలాంటి స్కిట్ చేసేసరికి రెమ్యూనరేషన్ పెంచడం లేదు అనే విషయం నిజమేనేమో అనిపిస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
